ఈశ్వర స్తుతిగీతాలు-4

కాబట్టి కీర్తనల్లోని విజయగీతాలు, ధన్యవాద సమర్పణ గీతాలు, ప్రపంచ భక్తిసాహిత్యంలోనే ఒక సర్వోత్కృష్ట అధ్యాయం. అవి గొప్ప ఓదార్పు, ఒక బాసట, నిస్పృహ చెందిన మనుషులకి, కుటుంబాలకీ, జాతులకీ ఒక స్వస్థత, ఒక నిరుపమాన ధన్యత.