చెప్పకుండా వెళ్ళిపోయాడు

సుమనశ్రీ వెళ్ళిపోయాడంటే సాహిత్యం గురించో, కవిత్వం గురించో రాయకుండా ఇదంతా ఎందుకు రాస్తున్నాని అనిపిస్తోంది కదూ! ఎందుకు సాహిత్యం? కవిత్వం? ఎందుకు అన్నేళ్ళ పాటు అన్నేసి గంటల పాటు కవిత్వం గురించి మాట్లాడుకుంటూ గడపడం? ఒక మనిషి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు నువ్వు పక్కన లేకపోయాక నీ స్నేహాలకీ, నీ సాహిత్యానికీ ప్రయోజనమేముంది?