విస్మృత సమాజాల కవి

విస్మృత సమాజాలకీ, విస్మృత విలువలకీ గొంతునివ్వడమే తన జీవనధ్యేయంగా చెప్పుకున్నాడతడు. రంగురంగుల యూకలిప్టస్ అడవులు, పచ్చిక బయళ్ళు, కొండలు, నదులు, ధారాళమైన సూర్యకాంతితో వెల్లివిరిసే ఆస్ట్రేలియన్ ఆకాశాలూ అతడి కవిత్వంలో అడుగడుగునా  కనిపిస్తుంటాయి.