అప్పుడు తెలిసింది నాకు భగవంతుడి హస్తమంటే నాకు నేను చేసుకున్న వాగ్దానమని అప్పుడు తెలిసింది నాకు భగవంతుడి అనుగ్రహమంటే నా సోదరుడి సన్నిధి అని అప్పుడు తెలిసింది నాకు ఈభూమ్మీద ఇంతదాకా ప్రభవించిన సమస్త పురుషులూ నా అన్నదమ్ములేనని సమస్త స్త్రీలూ నా అక్కచెల్లెళ్ళేలని, నేను ప్రేమిస్తున్నవాళ్ళేనని
నా గురించి పాడుకున్న పాట-1
ఈ వర్తమానాన్ని మించిన ప్రారంభం మరెక్కడో లేదు ఇప్పుడేది నడుస్తోందో దాని కన్నా మించిన యవ్వనం, యుగం మరొకటి లేదు ఈ ప్రస్తుతక్షణం కన్నా పరిపూర్ణమైంది మరెప్పుడూ లేదు ఈచోటుని దాటిన స్వర్గం మరొకటి లేదు, నరకం మరొకటి లేదు.
జీవన్మృత్యువుల సరిహద్దులో
ఒక కవి, ఒక గాయకుడు మృత్యువుకు ఎదురేగే పద్ధతి అది కాదు. బహుశా ఒక యోగిని, ఒక ఉపాసకుణ్ణి మృత్యువు ఒక్కసారిగా చంకనపెట్టుకుపోలేదేమో. ఈ ప్రపంచంతో పూర్తిగా ముడివడ్డ ఒక జీవితప్రేమికుడి బంధాలు తెంచడం మృత్యువుకి ఒకపట్టాన చాతకాలేదేమో!
