నా గురించి పాడుకున్న పాట-5

దేనికైనా సిద్ధపడతాను, ఎంతకైనా తెగిస్తాను నన్నెవరు ముందు చేరదీస్తే వాళ్ళకి నా ప్రాణం పెడతాను నా కోసం ఆకాశాన్ని దిగిరమ్మని అడుక్కోను అందుకు బదులు నన్ను నేనే ఉదారంగా వెదజల్లుకుంటాను.