ముందుకిగాని, వెనక్కిగాని, పక్కకి గాని జీవితం ఎక్కడెక్కడ సంచలిస్తున్నా, నేను దానికి ముద్దిడుతుంటూనే ఉంటాను. దాని పగుళ్ళనీ, లోపాల్నీ పక్కన పెట్టి ఏ ఒక్క మనిషినీ, ఏ ఒక్క విషయాన్నీ దాటిపోకుండా ప్రతి ఒక్కదాన్నీ నాకోసమూ, ఈ పాటకోసమూ కూడా నాలో ఇంకించుకుంటాను.
