నా గురించి పాడుకున్న పాట-14

వీథుల్లో ఎక్కడ చూసినా దేవుడు జారవిడిచిన ఉత్తరాలే కనిపిస్తున్నాయి, ప్రతి ఒక్క లేఖమీదా దేవుడు తన పేరిట సంతకం చేసిపెట్టాడు, అవెక్కడున్నాయో వాటిని అక్కడే వదిలిపెట్టేస్తున్నాను, ఎందుకంటే, నేనెక్కడికి వెళ్ళినా, తక్కినవాళ్ళు కూడా ఎప్పటికప్పుడు అక్కడికొస్తూనే ఉంటారు గనుక.

నా గురించి పాడుకున్న పాట-13

కుంగిపోతున్న ఆ మానవుణ్ణి పట్టుకుని అజేయసంకల్ప శక్తితో పైకి లేపుతాను, ఓ హతాశయుడా! ఇదిగో నా భుజం, దేవుడి మీద ఒట్టు, నువ్వు ఆశలు వదులుకోవలసిన పనిలేదు, నీ మొత్తం భారం నామీద పడవెయ్యి.

నా గురించి పాడుకున్న పాట-12

ప్రతి బహిష్కృతుడి కష్టంలోనూ, ప్రతి ఒక్క తిరస్కృతుడి యాతనలోనూ పాలుపంచుకోండి చెరసాలలో బంధించిన మనిషి స్థానంలో నన్నూహించుకోండి. నిరంతర నిరుత్సాహకర వేదన ఎలా ఉంటుందో తెలుసుకోండి.