అనిపిస్తున్నది అనిపిస్తున్నట్టుగా

అందుకనే, ఒక్కసారన్నా ఆరుబయటకు పోయి బొమ్మలు వెయ్యాలని ప్రతి రోజూ అనిపిస్తూంటుంది. అలాగని నేనొక గొప్ప చిత్రకారుణ్ణని కాదు. అలా బయటకి పోయి నా ఎదట కనిపిస్తున్న దృశ్యాన్ని నాకై నేను వ్యాఖ్యానించుకోవడంలో నా మటుకు నాకొక ప్రార్థనలాగా అనిపిస్తుంది.