పట్టుమని వందపేజీలు కూడా లేని ఈ పుస్తకంలో 'పూల ప్రజ్ఞానం' తో పాటు, పరిమళం మీద కూడా ఒక వ్యాసం ఉంది. రెండింటిలోనూ మాటర్లింక్ రాసింది సైన్సు కాదు. కవిత్వం. కానీ పూలనీ, పూల సుగంధాన్నీ ఒక శాస్త్రజ్ఞుడిగా పరిశీలించాక పుట్టిన కవిత్వం అది. ఇంకా చెప్పాలంటే, అతడిలోని శాస్త్రజ్ఞుడివల్ల అతడిలోని కవి అదృశ్యం కాకపోగా, మరింత బలం పుంజుకున్నాడన్నమాట.
