నా మిత్రురాలు నన్నట్లా సూటిగా ప్రశ్నించాక ఒక క్షణం ఆలోచించాను. ఆమె చెప్తున్నది సహేతుకమే గాని నేనెందుకలా ఉండలేకపోతున్నాను అని ఆలోచించాను. నా సృజనశక్తుల్ని ఆమె ఆశిస్తున్నట్టుగా, సమాజాన్ని ప్రభావితం చెయ్యడానికి ఎందుకు వినియోగించలేకపోతున్నాను అని నా అంతరాత్మని నేను ప్రశ్నించుకున్నాను.
