సంతోషం ఏ రంగులో ఉంటుంది

నాకూ, చీనా కవిత్వానికీ ఏదో జన్మాంతర సంబంధం ఉందనుకుంటాను. ఆ కొండలూ, ఆ లోయలూ, ఆ సుదీర్ఘమైన మట్టిబాటలూ, ఆ ఎర్రపూల చెట్లూ, ఆ పిల్లంగోవి పాటలూ- నేను ప్రాచీన చీనా కవిత్వం చదివినప్పుడల్లా, ఆ పాటలు నా చిన్నప్పుడు మా ఊళ్ళో విన్నవే అని అనిపిస్తూంటుంది.