దైనందిన జీవితంలో హెచ్చుతగ్గుల్లేని సమాజం ఒనగూడాలంటే భాషలోనూ, జ్ఞానంలోనూ కూడా హెచ్చుతగ్గులుండకూడదని వచనకవులు మనసారా నమ్మారు. కాబట్టి వారు అప్పటికి ప్రచలితంగా ఉన్న ఒక్క ఛందోనియమాన్ని కూడా పాటించవలసిన పనిలేని ఒక నవ్యవాహికగా వచనాన్ని తీర్చిదిద్దుకున్నారు.
బసవన్న వచనాలు-9
అలాగే బసవన్న వచనాల్లో కూడా ఆయన దయాహృదయం, తోటిమనిషికోసం పడిన అనుకంపన, శివశరణుల పట్ల సంపూర్ణసమర్పణ ఎలా స్పష్టంగా కనిపిస్తున్నాయో, ఆ వచనాల్లోని సాహిత్య విలువలు కూడా అంతే స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాటిని స్థూలంగా పరిశీలిద్దాం.
బసవన్న వచనాలు-8
భక్తి కవుల దృష్టిలో ఆధ్యాత్మికత అంటే రాజీలేని నైతికత మాత్రమే. ఈ నేపథ్యంలో చూసినప్పుడు బసవన్న భక్తి ఉద్యమంలోని విమోచక శక్తి ఎంత విప్లవాత్మకమో మనకి అర్థమవుతుంది.
