పదవతరగతి పిల్లల్లో మాటాడుతూ తమ కెరీర్ గురించి వాళ్ళకెట్లాంటి ఊహలున్నాయో ఒక్కొక్కరినీ అడిగాను. అందరిలోకీ, ఆశ్చర్యం, ఒకమ్మాయి ఆర్మీలో చేరాలన్నది తన కల అని చెప్పింది. నేనున్న కొద్దిసేపట్లోనే ఆ పిల్లలు వాళ్ళ ప్రతిభ, సాధన, సంతోషం మొత్తం నా ముందు కుమ్మరించడానికి పోటీ పడ్డారు. ఆ పిల్లల ఉత్సాహం మధ్య నాకు సమయం తెలియలేదు. చాలా కాలం తర్వాత మళ్ళా నాలో కొత్త రక్తం ప్రవహించినట్టుగా ఉంది.
కాళీ పదములు
ఈమె జీవితంలో ఏ ఉత్పాతాల్ని, ఏ సంక్షోభాల్ని, ఏ వైక్లబ్యాల్ని ఎదుర్కొన్నదోగాని హృదయాన్ని గొంతుగా మార్చి తల్లిని పిలిచింది. ఆమె తల్లినెట్లా ఆవాహన చేసిందో ‘ఆవాహన’ కవితలో ప్రతి ఒక్క వాక్యం ఒక ప్రకంపనగా సాక్ష్యమిస్తుంది. వట్టి ఆవాహనా, వట్టి పిలుపూ, వట్టి ఆరాటమే కాదు, ఆమెని తల్లి ఎట్లా కరుణించిందో కూడా ఈ కవిత్వం మనకి ఆనవాలు పట్టిస్తున్నది.
21వ శతాబ్దపు కవి
ఒక్క మాటలో చెప్పాలంటే, అతడు తన సర్వేంద్రియాలతోనూ కవితని చూస్తాడు, పలుకుతాడు. దాన్నతడు Wholespeak అన్నాడు. అది మనిషి తన పూర్తి అస్తిత్వ స్పృహతో, తన కలలు, మెలకువలు మొత్తాన్ని కలుపుకుంటూ మాట్లాడే మాట. తద్విరుద్ధమైనదాన్ని, అంటే, మన వ్యవహారానికి మాత్రమే పనికొచ్చేదాన్ని Narrowspeak అన్నాడు. ఈ మెలకువలో అతడు ఆస్ట్రేలియన్ ఆదివాసుల ప్రాపంచిక దృక్పథానికి సంపూర్ణ వారసుడు.
