ఒక సూఫీ సాయంకాలం

నా వరకూ ప్రపంచ కవితా దినోత్సవం నిన్న సాయంకాలమే అడుగుపెట్టింది. లా మకాన్ లో ఎవరో హిందుస్తానీ గాయకుడు భక్తిగీతాలు ఆలపించబోతున్నాడు, వెళ్తారా అని ఒక మిత్రురాలు మెసేజి పెట్టడంతో నిన్న సాయంకాలం నేనూ, అక్కా, ఆదిత్యా ఆ సంగీత సమారోహానికి హాజరయ్యాం. లా మకాన్ ఎనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఆ కచేరీ సంగీతసాహిత్యాల్ని జమిలిగా వర్షించింది. మరవలేని వసంతరాత్రిగా మార్చేసింది.