అతడే ఒక సముద్రం

రవి, స్వాతి కుమారి తమ అనువాదంలో హెమింగ్వే వాక్యంలోని ఆ మహిమను ఎంతవరకు పట్టుకున్నారో నాకు తెలియదు. ఎందుకంటే నేనిప్పటికీ ఆ ఇంగ్లీషు మూలం చదవలేదు కాబట్టి. కాని, తెలుగులో చదువుతున్నప్పుడు కొన్ని వాక్యాలు నన్ను బలంగా తాకకపోలేదు.