చైనాను చూపించే కథలు

ఒక మామూలు సమాజంలో, చిన్ని చిన్ని ఆశలు, నిరాశలు, త్యాగాలు, మోహాలు, మోసాలతో కూడుకుని ఉండే జీవితమే, ప్రపంచంలో తక్కిన ప్రతి చోటా ఉండే జీవితమే అక్కడ కూడా దర్శనమిస్తుంది. కానీ ఆ సాధారణ సుఖదుఃఖాలకు ఆ ప్రజలు లోను కావడంలో, ఆ దేశానిదే అయిన అద్వితీయ లక్షణమేదో ఉంది. ఆ కథలు దాన్నే పట్టుకున్నాయి, చిత్రించడానికి ప్రయత్నించేయి.