ప్రజాకవి బై-జుయి

అతడు తన కాలం నాటి సమాజాన్నీ, దాని అసమానతలనీ, సాధారణ ప్రజల్నీ, వారిసుఖదుఃఖాల్నీ ఎంతో కరుణతోనూ, సహానుభూతితోనూ చిత్రించాడు. కొన్ని కొన్ని కవితలు ఇరవయ్యవశతాబ్ది సోషలిస్టు కవులు రాసినంత కొత్తగానూ, కదిలించేవిగానూ కూడా కనిపిస్తాయి.