సుశీలకి సులేమాన్ తో కలిగిన ప్రేమానుభవం, టాగోర్ మాటల్లో చెప్పాలంటే, గ్రీకు నగరం స్పార్టా అభిలాషలాంటిది. అది సంకుచితం. వారిద్దరికే పరిమితం. నిజానికి అక్కడ ఇద్దరికి కూడా చోటు లేదు. అది ఇద్దరు ఒకరిగా మారి, చివరికి ఏ ఒక్కరూ మిగలని బాధానుభవం. నారాయణప్పతో ఆమెకి ఆ తరువాత సంభవించింది ఏథెన్సు నగరానికి సంభవించినటువంటిది. అది ప్రేమ తాలూకు అత్యున్నత స్థాయి.
ప్రేమనిచ్చిన ప్రేమ వచ్చును
దాంపత్య సంబంధాల్లోగానీ, కుటుంబసంబంధాల్లో గానీ, సమస్య ఎక్కడొస్తుందంటే మనం ప్రేమనివ్వకుండా, ఎదుటివాళ్ళనుంచి ప్రేమని ఆశించడం వల్ల. అక్కడితో ఆగకుండా డిమాండ్ చెయ్యడం వల్ల. అలాగే మనం ప్రేమనిలపకుండా, ఎదుటివాళ్ళు నిలపాలని కోరడం వల్ల.
ఆంధ్ర గద్య చంద్రిక
తెలుగులో పద్య సంకలనాలు ఉన్నట్లుగా గద్య సంకలనాలు చాలా తక్కువ. తెలుగు కవిత్వాన్ని 'కావ్యమాల' (1959) పేరిట సాహిత్య అకాదెమీ కోసం కాటూరి వెంకటేశ్వర రావుగారు ఒక సంకలనం తీసుకొచ్చారు. అయితే అందులో కవుల ఎంపిక, పద్యాల ఎంపిక మొత్తం మల్లంపల్లి శరభయ్యగారే చేసారు.