నా జీవితమంతా ఉపాధ్యాయులతోనే గడిచింది

పాఠశాలల్లోనూ, కళాశాలల్లోనూ నాకు బోధించినవాళ్ళతో పాటు జీవితానికి ఆవశ్యకమైన ప్రతిరంగం గురించీ అంతోఇంతో మొదటి పాఠాలు నేర్పిన మా నాన్నగారితో పాటు, తరగతిగదులకు బయట నాకు గురుత్వం వహించిన నా సాహిత్యాచార్యులు నామీద చూపించిన ప్రభావం విలువకట్టలేను

ఏది ఇచ్చినా శ్రద్ధగా ఇవ్వాలి

నా జీవితమంతా పాఠశాలలు సంతోషచంద్రశాలలుగా మారాలని కలలుగన్నాను. అటువంటి ఒక కల సాకారం చెందినట్టుగా ఆ పాఠశాల గోచరించింది. అక్కడి పరిశుభ్రత, ఆ చిన్నారుల వదనాల్లో చిరునవ్వులు, ఉత్సాహం నాకెంతో బలం పోసాయి.