ఇప్పుడు అనల్ప బుక్ కంపెనీ బలరాం గారు ఆ పుస్తకాన్ని అనల్ప ప్రచురణ కింద మళ్ళీ కొత్తగా వెలువరించారు.
నా చంపారన్ యాత్ర
1917-18 సంవత్సరాల్లో చంపారన్ ప్రాంతంలో గాంధీజీ సత్యాగ్రహం చేపట్టిన ప్రాంతాల్ని వాడ్రేవు చినవీరభద్రుడు ఆగస్టు 2018 లో సందర్శించి రాసిన యాత్రాకథనం. గాంధీజీ సందర్శించిన గ్రామాలు, పట్టణాలతో పాటు, బుద్ధుడి జీవితంతో పెనవేసుకున్న మరికొన్ని ప్రాంతాలను చూడటం కూడా ఈ యాత్రకొక అదనపు ఆకర్షణ.
కొండమీద అతిథి
ఇంతవరకు వెలువరించిన కవితాసంపుటాల్లో ఆరవది. 2014 నుంచి 2018 మధ్యకాలంలో రాసిన యాభై కవితల సంపుటి. ఈ పుస్తకం ఆత్మీయుడు రాళ్ళబండి కవితాప్రసాద్ స్మృతికి అంకితం.