పరమహంస

సద్గురు ఫూలాజీ బాబా సిద్ధపురుషుడు. పరమహంస. నా చిన్నప్పుడు శ్రీ మహాభక్త విజయంలో నేను చదివిన భక్తుల జీవితాల్లాంటి జీవితమే ఆయనదని తెలుసుకునే కొద్దీ, ఆయన్ని కళ్ళారా చూసినందుకూ, ఆయనతో సంభాషించే అదృష్టానికి నోచుకున్నందుకూ నేను నిజంగా భాగ్యవంతుణ్ణని నాకు తెలుస్తూనే ఉంది.

అక్షరప్రేమికుడు

తెలుగు సాహిత్యానికి అపారమైన సేవచేస్తున్నామని చెప్పుకునే కొన్ని ఎన్నారై సంస్థల వెబ్ సైట్లు కూడా గాలించాను. ఎన్.వి. రమణయ్య అనే పేరు లేకుండానే తమ వేలాది వెబ్ పేజీలు కొనసాగుతుండటం ఎంత సిగ్గుపడవలసిన విషయమో వాళ్ళిప్పటికేనా గ్రహించాలి.

యద్దనపూడి

తెలుగు రచయితలు, ముఖ్యంగా, సమాజపరివర్తన కోరుకునేవాళ్ళు కూడా విద్య గురించి మాట్లాడని ఈ రోజుల్లో, అంత జనాదరణ పొందిన రచయిత్రి, ఆ వయసులో, విద్యగురించి ఆలోచించడం, సమాజంలో విద్యావ్యాప్తి గురించి తనవంతు తాను కూడా ఏదేనా చేయాలనుకోవడం.