ట్రివియం

కానీ, ఆ గ్రీకు గ్రంథాల్ని మధ్యయుగాల విద్యార్థులు ఏ పద్ధతిలో చదివారు? వాటిని వారికెవరు బోధించారు? ఏ బోధన-అభ్యసన ప్రక్రియ వల్ల లియోనార్డో డావిన్సీ, మైకెలాంజిలో, బొకాషియో, డాంటే, షేక్ స్పియర్, గెలీలియో, బ్రూనో లు రూపొందారు? ఏ విద్యాబోధన పునాదులమీద తదనంతర కాలాల్లో ఫ్రాన్సిస్ బేకన్,న్యూటన్, వోల్టేర్, డెనిస్ డిడిరో, గొథే, సెర్వాంటిస్ లు ప్రభవించగలిగారు?

విద్యాసన్నద్ధత

ఈ ప్రశ్నకి ధైర్యంగా జవాబివ్వాలంటే, మనం చూడవలసింది, భూసంస్కరణలు, రాజకీయసంస్కరణలు, పాలనా సంస్కరణల వైపు కాదు, విద్యా సంస్కరణల వైపు. నిజమే, విద్యావ్యవస్థని సంస్కరించాలంటే భారతదేశాన్ని ముందు సామాజికంగా సంస్కరించాలి. కాని, ఆ సంస్కరణలకోసం పోరాడుతున్నవాళ్ళ ఎజెండాలో విద్య ఎక్కడుందన్నది కీలక ప్రశ్న.

దిశానిర్దేశం

గ్రామీణ ఉపాధ్యాయుడు ఒక నిష్ఠుర, ఏకాంత ప్రపంచంలో కూరుకుపోయి తననొక అభిశప్తుడిగా భావించుకుంటూ ఉన్నాడు. అతణ్ణి సమీపించి, అతడు చేస్తున్న పని చూసి, అతడి భుజం తట్టడానికి ప్రభుత్వానికి సమయం లేదు. ప్రభుత్వానికి లెక్కలు కావాలి. అంకెలు కావాలి. కాని, పాఠశాలలకి ఉత్సాహం కావాలి, ఉత్తేజం కావాలి. అదివ్వగలిగినవాళ్ళు ఎవరు? ఎక్కడున్నారు?