కథాశిల్పం-4

కాబట్టి పై మూడు నిర్వచనాల్నీ కూడా మనం ఒక నిర్వచనంగా మార్చుకోవచ్చు. అదేమంటే, సార్వత్రిక నిర్మాణాలకో, సాంస్కృతిక నిర్మాణాలకో అనుగుణంగా వివిధ సంఘటనల్ని గుదిగుచ్చి చెప్పడం ద్వారా వాటిలోని అంతర్గత విశేషాలను తేటతెల్లం చేస్తూ, వాటిని ఒక కథగా మార్చడమే కథన ప్రణాళిక.

కథాశిల్పం-3

ఇతివృత్తం అంటే సారాంశమూ, రసానుభూతీ రెండూను. రసానుభూతిలేని సారాంశం కేవలం శాస్త్రసత్యంగా మాత్రమే మిగిలిపోతుంది. రసానుభూతిని మేల్కొల్పే ఇతివృత్తం మాత్రమే కథగా మారుతుంది. కథాశిల్పం అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, ఒక ఇతివృత్తాన్ని రసానుభూతిగా మార్చగలిగే కౌశల్యం.

కథా శిల్పం-2

మనల్ని ఏదో ఒక భావమో, అనుభవమో ఏళ్ళ తరబడి వేధిస్తూ ఎంత ప్రయత్నించినా కథగా రూపుదిద్దుకోకపోవడం మనలో చాలామందికి అనుభవంలోకి వచ్చిన విషయమే. అది ప్రధానంగా ఇతివృత్తానికి సంబంధించిన సమస్య అని మనం గుర్తుపెట్టుకోవాలి. దానికి పరిష్కారం, మనల్ని వేధిస్తున్న ఆ భావాన్ని సాహసంగా పట్టుకుని కథగా మార్చడానికి పూనుకోవడమే.