సాహిత్య పాదయాత్ర

తూర్పు గోదావరి జిల్లాలో కొందరు సాహిత్యప్రేమికులు, సంస్కృతీ ప్రేమికులు, విద్యావంతులు అటువంటి ఒక ప్రయత్నానికి శ్రీకారం చుడుతున్నారు. శ్రీ పాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారు తెలుగు కథని పెంచిపెద్దచేసిన 'పొలమూరు' నుంచి ఆధునిక తెలుగు స్వేచ్ఛాగాయకుడు దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు పుట్టిపెరిగిన 'చంద్రం పాలెం' గ్రామం దాకా సుమారు యాభై కిలోమీటర్లు సాహిత్య పాదయాత్ర చేపడుతున్నారు.

పచ్చ బంగారులోకం

వారం రోజుల కిందట ఒక సాయంకాలం ఇంటికి వచ్చేటప్పటికి, 'పచ్చ బంగారులోకం' వచ్చి ఉంది. మొదటిపేజీమీదనే 'నా చిన్నతండ్రికి అత్యంత ప్రేమతో - అమ్మ' అని మంగాదేవిగారి ఆకుపచ్చ సంతకం ఉంది. ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్న పుస్తకం. అసలు మొత్తం ఈ పుస్తకమే మంగాదేవిగారి ఆకుపచ్చ సంతకం అనిపించింది.

అడవినుండి అడవికి

ఈ వైఖరికి భిన్నమైన మరొక వైఖరి ఉంటుంది. అక్కడ ఏవో కొన్ని ఆనందమయ, సౌందర్యమయ క్షణాలంటూ విడిగా ఉండవనీ, నువ్వు జీవించే ప్రతి క్షణం అనుక్షణం అటువంటి సౌందర్యాన్ని దర్శించవచ్చుననీ, ప్రతి క్షణం ఆనందమయంగా గడపవచ్చుననీ భావించే ఒక ధోరణి.