థిచ్ నాట్ హన్-5

ద్దరు స్త్రీ పురుషులు లేదా ఇద్దరు మనుషులు ప్రేమలో పడ్డప్పుడు వాళ్ళల్లో గొప్ప శక్తిపాతం సంభవిస్తుంది. కాని దాన్నెట్లా ఎదుర్కోవాలో, ఆ శక్తిని, తమ శ్రేయానికీ, చుట్టూ ఉన్న లోక శ్రేయానికీ ఎట్లా వినియోగించుకోవాలో వాళ్ళకి తెలీదు. వినియోగించుకోవచ్చని చెప్పేవాళ్ళూ లేరు, చెప్పినా ఎలా వినియోగించుకోవాలో తెలిసినవాళ్ళూ లేరు.

థిచ్ నాట్ హన్-4

జీవితంలో చూడవలసిన యుద్ధాలు, లోపలా, బయటా కూడా చూసిన తరువాత, పూర్తిగా వికసించిన వ్యక్తిత్వంతో, తన అరవై ఏళ్ళ వయసులో ఆయన తన ప్రేమానుభవం ఆధారంగా మహాయాన బౌద్ధాన్ని తన శిష్యులకు వివరించిన తీరు నన్ను నివ్వెరపరిచింది. ఆ పుస్తకం పూర్తిచెయ్యగానే నేనున్నచోటినుంచే ఆ గురువుకొక సాష్టాంగ నమస్కారం చెయ్యకుండా ఉండలేకపోయాను.