రేడియం తవ్వితీయడం

ఈ కవితల్లో కవి కొన్ని సార్లు ఏకాకి, కొన్ని సార్లు మహాసాంఘికుడు, కొన్ని సార్లు కైదీ, కొన్ని సార్లు స్వేచ్ఛాగాయకుడు. రష్యాలో కవిత్వం ఒక జీవన్మరణ సమస్య అన్నాడు యెవ్తుషెంకో. ఈ సంకలనంలోని మహాకవులంతా మృత్యువుతో ముఖాముఖి నిలబడి కవిత్వం చెప్పినవారే.

రాజారావుకి

ఈ అత్యంత అవినీతిమయమైన గణతంత్రం నుంచి మనకు ముక్తి ఉన్నదా? కవులు, రచయితలు రాజకీయ విమోచన కోసం కవిత్వం రాస్తున్నారు. మరికొందరు సామాజిక విమోచన కోసం గొంతెత్తుతున్నారు. మిత్రులారా, వాటిలో నాకు నమ్మకం చిక్కట్లేదు. ఇప్పుడు నేను చెయ్యగలిగిందల్లా, మీవోష్ చెప్పుకున్నట్టు దేవుడి రాజ్యంకోసం ప్రార్థించడమే.

హామ్లెట్ సమస్య

ఈ ప్రపంచంలో క్రీస్తు తర్వాత అంత విస్తారంగా రాసింది హామ్లెట్ గురించేనని బుచ్చిబాబు అన్నట్టు గుర్తు. రాధాకృష్ణమూర్తిగారు హామ్లెట్ గురించి ఎలానూ రాస్తారనే అనుకున్నాం. కాని ఏమి చెప్తారా, నాలుగువందల ఏళ్ళ సాహిత్యచర్చకు అదనంగా, అన్నదే మా ఉత్కంఠ. కాని, ఆయన రాసిన ఈ వాక్యాలతో అన్నిటికన్నా ముందు ఇంగ్లీషు సాహిత్యమే సుసంపన్నమైంది.