కవికీ పండితుడికీ మధ్య ఒక పచ్చికబయలు ఉంది. పండితుడు దాన్ని దాటాడా వివేకి అవుతాడు. కవి దాటాడా, ప్రవక్త అవుతాడు.
ప్రేమగాయపు మరక
'ఉల్టీ హో గయీఁ సబ్ తద్బీరేఁ’ అంటో ఆలపించిన మీర్ గజల్. శరాన్ని బయటకు లాగవచ్చుగాని, గాయం మిగిల్చిన మరక అట్లానే ఉండిపోతుంది. అట్లాంటి ప్రేమగాయపు మరకలాంటి ఈ గీతం.
సుమనస్వీ, దయాళువూ
ఖురాన్ చెప్పే సమాధానమేమిటంటే, ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్న రహమత్ వల్లనే , స్వభావరీత్యా రహమత్ సమన్వయకారకం కావడం వల్లనే ఈ విశ్వాన్నీ, విశ్వంలో వ్యాపించి ఉన్న ప్రతి ఒక్కదాన్నీ నడిపించే వ్యూహమంటూ ఒకటి ఉన్నది. అది నిలబెట్టేదిగా ఉంటున్నది.