హాన్ షాన్

ఆయన్ని చివరిసారి కొండలమీదనే చూసారనీ, ఒక కొండనెర్రె విచ్చుకుని అందులోనే ఆయన అదృశ్యమైపోయాడనీ ఐతిహ్యం. ఒక్కటి మటుకు స్పష్టం. కవీ, కొండా ఒకటైపోయిన ఇటువంటి ఉదాహరణ ప్రపంచసాహిత్యంలోనే మరొకటి లేదు.

ప్రకృతి, సంస్కృతి

కాని కొకింషు కవులు ఆ పూలు పూయటాన్నీ, రాలిపోవటాన్నీ జపాన్ జీవితంలో భాగంగా మార్చేసారు. వేల ఏళ్ళుగా రాలుతున్న పూలని చూస్తూ, ఆ కవితల్ని తలుచుకుంటూ, తిరిగి తాము కూడా కవితలు చెప్తూ జపనీయ జాతి సుసంస్కృతమయ్యే విద్య నేర్చుకుంటూ ఉంది.

వెళ్ళిపోతున్న వసంతం

జీవితంలోని క్షణభంగురత్వాన్ని రాలుతున్న పూలు స్ఫురింపచేసినంతగా మరే దృశ్యమూ స్ఫురింపచెయ్యలేదనుకుంటాను. కాని చిత్రమేమింటంటే, ఈ దృశ్యం వైరాగ్యాన్ని మేల్కొల్పదు. అంతకన్నా కూడా జీవితం పట్ల మరింత ఇష్టాన్నే పెంచుతుంది