ఒక మనిషి మరో మనిషికోసం

హాన్స్ బెర్రీ ముప్పై నాలుగేళ్ళ వయసులోనే కేన్సర్ తో మరణించినా ఎన్నో జీవితకాలాలకు సరిపడా కృషిచేసి వెళ్ళిపోయింది. To be Young, Gifted and Black -ఆమె ఆత్మకథకి పెట్టుకున్న పేరు. ఆ మూడు విశేషణాలకీ ఆమె పేరు సమానార్థకంగా నిలబడిపోతుంది.

లొరైన్ హాన్స్ బెర్రీ

మా మాష్టారు రాసిన ఒక పద్యంలో 'పునర్యానం' అనే పదం వాడితే, నేనా పదం తీసుకుని ఒక కావ్యం రాసాను. ఆ పుస్తకం ఆవిష్కరిస్తో మా మాష్టారు కవిత్వానికి multiply అయ్యే గుణముంటుందనీ, వాల్మీకి ఎక్కడో బాలకాండలో వాడిన ఒక పదబంధం తీసుకుని కాళిదాసు కుమారసంభవమనే కావ్యం రాసాడనీ అన్నారు. 

హార్లెం సౌందర్యశాస్త్రం

కవిత్వం కూడా యవ్వనంలాగా, వసంతంలాగా, ఒక జీవితంలో ఒక్కసారి మటుకే వచ్చివాలుతుంది. నిర్మలమైన ప్రేమలాగా, యవ్వనారంభసమయంలోనే సాక్షాత్కరిస్తుంది. కవి అంటే పాతికేళ్ళలోపు, మహా అయితే, ముప్పై ఏళ్ళ లోపు కవిత్వం చెప్పినవాడే, కీట్స్ లాగా, రేంబో లాగా, తోరూదత్ లాగా, మహా ప్రస్థానగీతాలు రాసిన శ్రీ శ్రీ లాగా. ఆ తర్వాత కూడా కవిత్వం రాయొచ్చుగాని, అప్పుడది అయితే వచనమవుతుంది, లేదా ప్రవచనమవుతుంది.