కామరూప-5

కార్యాలయ సిబ్బంది తపాలు తెచ్చి ఆయన బల్ల మీద పెట్టారు. అర్జెంటుగా సంతకం పెట్టవలసిన కాగితాలు లెటర్ హెడ్ మీద ఫెయిర్ కాపీ చేసి ఆయనముందు పెట్టారు. కాని ఆయన దృష్టి వాటిమీద లేదు. నవకాంత్ బారువా కవితలు ఏవి వినిపిస్తే తాను తన గురువుకి న్యాయం చెయ్యగలనా అన్నదానిమీదనే ఆయన సతమత మవుతున్నాడు. ఎట్టకేలకు బారువాది మరొక కవిత, 'కొలతలు' అనే కవిత, వినిపించాడు.

కామరూప-4

మరుక్షణం లోనే ఆయన ఆ కవితలో లీనమైపోయాడు. బహుశా ఆ సంపుటిని ఆయన తన విద్యార్థిదశనుండీ ఎన్ని వందలసార్లు చదివిఉంటాడో, ఆ గడిచిన జీవితమంతా, ఆ జ్ఞాపకాలన్నిటితోటీ మరోమారు జీవిస్తున్నంత ఆదరంగా, శ్రద్ధగా, ప్రేమగా ఆయన ఆ కవిత పఠించసాగాడు.

కామరూప-3

ఆ పాట వినిపిస్తున్నప్పుడు బ్రహ్మపుత్రమీంచి నామీద ప్రసరించిన సన్నని తీయతెమ్మెర, దూరంగా ఒడ్డున గౌహతి నగరదీపాలు, ఒకవైపు దూరంగా దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న కామాఖ్యదేవాలయం. ఆ పాట పాడిన గాయకి ఎవరోగాని, ఆ స్వరం, ఆ ఈశాన్యభూమిలోని ఏ అడవుల్లోనో చందనతరువులమీద గూడుకట్టుకున్న తేనెపట్టుల తీపిదనాన్ని ఆ గాలుల్లోంచి తీసుకొచ్చి నా మీద కుమ్మరించిందనిపించింది.