కామరూప-8

నాలుగు రోజుల ప్రయాణంలో నువ్వో ప్రాంతాన్ని ఏ మేరకు చూడగలవు? ఒక సంస్కృతినీ, సాహిత్యాన్నీ, సంగీతాన్నీ ఏ మేరకు అర్థం చేసుకోగలవు? ఏమి వెంటతెచ్చుకోగలవు?

కామరూప-7

ఆ అత్యంత ప్రాచీనమైన దేవాలయ శిఖరాలమీద సుప్రభాత సూర్యకాంతి. ఆ చెట్లమీద, ముఖ మంటపం మీద, స్తంభాలమీద, ద్వారాలమీద, ద్వారప్రతిమలమీద శుభ్రసూర్యరశ్మి, ఎక్కడ చూసినా స్వర్ణ సూర్యరశ్మి వర్షిస్తూ ఉంది. దేవాలయ శిఖరాల మీద పావురాలు వాలి ఉన్నాయి. వాటి నీడలు కాంతిమంతంగా కదుల్తున్నాయి.

కామరూప-6

మామూలుగా మనం ఒక కవినో, గాయకుణ్ణో, చిత్రకారుణ్ణో చూస్తాం. కొంతమంది కవిత్వం రాస్తారు, పాటలు పాడతారు కూడా. కొంతమంది కవిత్వం రాసి పాటలు పాడి నాట్యం కూడా చేస్తారు. కొంతమంది స్వాతంత్ర్యం కోసం పోరాడతారు. కొంతమంది విప్లవం కోసం జైలుకి వెళ్తారు. కాని ఇవన్నీ ఒకే ఒక్క వ్యక్తిలో కనిపిస్తే అతణ్ణే విష్ణు ప్రసాద్ రాభా అంటారు