నిజమైన కబీరు పంథీ

ఇది భక్తికాదు, ప్రార్థనకాదు, జీవిత స్ఫురణ. పొద్దున్నే కొలనులో ఎర్ర తామర రేకులు విచ్చుకున్నంత మృదువుగా మనిషిలో ఆత్మ విప్పారడం. వేపచెట్టు లోపల్నుంచీ విరిగి పైకి తీపిగా పొంగి పూలుగా విచ్చుకోవడం.

వంట ఒక వ్యాపకంగా

నీటిరంగుల చిత్రలేఖనానికీ, వంటకీ మధ్య చక్కని సారూప్యత ఒకటి కనిపించింది. నీటిరంగుల్తో చిత్రించడమంటే నీటితో ఒక సంవాదం. కాగితం మీద తడి ఎంత ఉంది, రంగులో కుంచె ఎంతముంచామూ, కుంచెలో నీటితడి ఎంత ఉంది, ఒక సారి రంగుపూత పూసాక, ఆ మొదటి పూత ఆరిందాలే

నా ఇంటర్మీడియేటు రోజులు

సాగర్ జీవితం నాలో కలిగించిన మరొక కలవరం, సాధారణంగా ఆ వయసు కలిగించే కలవరం. పదహారు, పదిహేడేళ్ళ అడాలసెంటు పిల్లవాడి మనసు చాలా లేతగా ఉంటుంది. ఎవరితోనైనా స్నేహం చెయ్యాలనిపిస్తుంది, ఎవరినైనా ప్రేమించాలనిపిస్తుంది. ప్రేమించినవాళ్ళకోసం ఏమైనా చెయ్యాలనిపిస్తుంది.