చేర్యాల ఒక సౌందర్య విశేషణం

చేర్యాల మరీ నేనూహించుకున్నంత చిన్న ఊరు కాదు. ఒకప్పటి తాలూకా కేంద్రమని కూడా తెలిసింది. తారురోడ్లూ, ప్రభుత్వాఫీసులూ, పెట్రోలు బంకూ, మన పెద్ద గ్రామాల్లోనూ, చిన్న పట్టణాల్లోనూ కనవచ్చే నిరర్థకమైన తీరికదనం- ఒక్క రెండు కుటుంబాలు మినహా. చేర్యాల అనే ఒక నామవాచకాన్ని సౌందర్య విశేషణంగా, ఒక చిత్రలేఖన శైలిగా మార్చేసిన ఆ రెండు కుటుంబాలు మినహా.

అమృత షెర్-గిల్

డిల్లీలో క్రాఫ్ట్స్ మూజియం చూసిన తరువాత,ఆధునిక భారతీయ చిత్రకారులంతా కోరుకునే గమ్యస్థలి, నేషనల్ గాలరీ ఆఫ్ మాడరన్ ఆర్ట్ కూడా చూసాం. రాజస్థాన్ పింక్ స్టోన్ తో కట్టిన జైపూర్ హౌస్ లో అడుగుపెడుతూనే ప్రాంగణంలో మరీ అంత ఆకర్షణీయంగా లేని వింకారోజియా పూలవరసలు. బయట ఎండకి ఎండి వానకి తడుస్తున్నట్టున్న శిల్పాలు.

వాళ్ళు తమ ప్రపంచాన్ని పునర్నిర్మిస్తున్నారు

తెలంగాణా టూరిజం వారు హైదరాబాదు మెట్రొపొలిస్ సందర్భంగా వారం రోజులపాటు చిత్రలేఖన శిబిరం నిర్వహిస్తున్నారు. తారామతి-బారాదరిలో సుమారు 90 మంది తెలంగాణా చిత్రకారులు రెండు విడతలుగా పాల్గొన్న ఈ శిబిరానికి రెండుసార్లు వెళ్ళాను. అంతమంది చిత్రకారులు ఒక్కచోట చేరి వర్ణచిత్రాలు గియ్యడంలో ఏదో గొప్ప శక్తి ఉత్పత్తి అవుతున్నట్టనిపించింది.