ఆ పిల్లవాణ్ణి ఎందుకు చిత్రించినట్టు?

అటువంటి ఆ దివ్యప్రసంగ ఘట్టంలో రెంబ్రాంట్ ఆ పిల్లవాణ్ణి ఎందుకు చిత్రించినట్టు? క్రీస్తు ఏ కపెర్నహోములోనో ప్రసంగిస్తున్నప్పుడు, అక్కడి దైనందిన జీవితాన్ని మనకి స్ఫురింపచేయడం కోసమా లేకపోతే ఆ పిల్లవాడి తల్లిదండ్రులెవరో వాళ్ళు అతడి ధ్యాస కూడా మర్చిపోయి క్రీస్తు బోధనల్ని తాదాత్మ్యంతో వింటున్నారని చెప్పడం కోసమా?

అనుకృతి

యూరోప్ లో అయినా, ప్రాచీన చైనా లో అయినా, చిత్రకారులు కావాలనుకునేవాళ్ళకి పూర్వ చిత్రకారుల కృతుల్ని అనుకరించడమే మొదటి సాధనా, ముఖ్యసాధనా కూడా. ఆ చిత్రకారులు తమదైన సొంత గొంతు వెతుక్కున్నాక కూడా పూర్వచిత్రకారుల మీద గౌరవంతోటో, వాళ్ళ కొన్ని చిత్రాల పట్ల పట్టలేని మోహంతోనో వాటిని తాము మళ్ళా చిత్రిస్తూండటం పరిపాటి.

చీనా చిత్రకళ

కానీ ఒక చీనాచిత్రకారుడు సుదీర్ఘ పర్వతశ్రేణి, అనంతజలరాశి, అడవులు, గ్రామాలు, నావలు, ఋతువుల్ని చిత్రిస్తూ కూడా అపారమైన శూన్యతని తన చిత్రంలో ఇమిడ్చిపెట్టగలుగుతున్నాడు. దృశ్యాన్ని దర్శనంగా మార్చే విద్య అది.