ఒక పేగుబంధం

లతని వినడం మొదలుపెట్టగానే, అది పగలా, రాత్రా, వసంతమా, హేమంతమా, అడవిదారినా, నగరకాశమా అన్న స్పృహపక్కకు పోతుంది నాకు. ఎక్కడగానీ, ఎప్పుడుగానీ, ఆ స్వరం నా ప్రపంచాన్ని అత్యంత అలౌకిక ఆత్మీయం లోకంగా మార్చేస్తుంది.

ఒక సూఫీ సాయంకాలం

నా వరకూ ప్రపంచ కవితా దినోత్సవం నిన్న సాయంకాలమే అడుగుపెట్టింది. లా మకాన్ లో ఎవరో హిందుస్తానీ గాయకుడు భక్తిగీతాలు ఆలపించబోతున్నాడు, వెళ్తారా అని ఒక మిత్రురాలు మెసేజి పెట్టడంతో నిన్న సాయంకాలం నేనూ, అక్కా, ఆదిత్యా ఆ సంగీత సమారోహానికి హాజరయ్యాం. లా మకాన్ ఎనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఆ కచేరీ సంగీతసాహిత్యాల్ని జమిలిగా వర్షించింది. మరవలేని వసంతరాత్రిగా మార్చేసింది.

అతడు వినిపించింది సంగీతం కాదా?

మనముందొక చిత్రముందనుకోండి, మామూలుగా మనం దాన్ని పట్టించుకోం. కాని అది, ప్రపంచ ప్రసిద్ధి చెందిన అత్యున్నతశ్రేణి చిత్రకారుల్లో ఒకడైన సై టొంబ్లీ (1928-2011) చిత్రించిన చిత్రమని చెప్పినప్పుడు మనమొకనిమిషం దాన్ని మరింత పరికించి చూస్తాం. ఆ చిత్రానికి అతడు Aristaeus mourning the loss of his bees (1973) అని పేరుపెట్టాడన్నప్పుడు మరింత ఆగి చూస్తాం.