మోసగించడం కష్టం

ఈ నాలుగు మాటలూ ఎందుకు రాసానంటే, తెలుగులో సినిమా ఉత్సాహం ఉన్న రచయితలు చాలామందే ఉన్నారు. ఎవరైనా ఎప్పుడైనా ఒక periodic movie తియ్యదలుచుకుంటే అది అటెన్ బరో 'గాంధి' లాగా, సత్యజిత్ రాయ్ ' షత్రంజ్ కే ఖిలాడి' లా గా నమ్మదగ్గదిగా, చూడదగ్గదిగా ఉండాలి.

అపరాజితుడు

సినిమా చూస్తున్నంతసేపూ మనకి గాంధీ, అబ్రహాం లింకన్ వంటి నాయకులు గుర్తొస్తూ ఉంటారు.కాని మరో విషయం కూడా స్ఫురిస్తూ ఉంటుంది. లింకన్ అంతర్యుద్ధాన్ని ఆపలేకపోయాడు. గాంధీజీ దేశవిభజనని నివారించలేకపోయాడు. కాని మండేలా అవిభక్త దక్షిణాఫ్రికాని సాధించగలిగాడు, నిలబెట్టగలిగాడు.

దంగల్

ఒక జాతిగా మనం మరీ తెలివిమీరిపోయామా? లేక మనం మనకే తెలీనంత సినికల్ గా మారిపోయామా? ఇట్లాంటి కథలు మన చుట్టూ, మన మధ్య సంభవించడం లేదా? ఇట్లాంటి పోరాటాల్ని మనం పోరాటాలుగా గుర్తించలేకపోతున్నామా?