పాతాళభైరవి

జానపదకథలన్నింటిలోనూ ఉండే అమాయికమైన నైతికతనే పాతాళభైరవిలో కూడా ఉన్నది. నువ్వు అదృష్టమ్మీదనో, మరొకరి శక్తి మీదనో ఆధారపడి ఎంతైనా సంపాదించవచ్చుగాక, అది నిలబడదు. కలకాలం నిలబడేదల్లా నువ్వు సొంతంగా ఏది సాధించగలవో అది మటుకే.

కూడె

ఈ సినిమా చూస్తున్నంతసేపూ, గోదావరిజిల్లాల్లోని జిల్లాపరిషత్ స్కూళ్ళూ, అక్కడ చదువుకుంటూ, ఏ కుటుంబకారణాలకో చదువు మధ్యలో ఆపేసినవాళ్ళూ, వాళ్ళ ఒక్కప్పటి క్లాస్ మేట్లూ, డ్రిల్లుమాష్టర్లూ, గ్రూపు ఫొటోలూ గుర్తొస్తూనే ఉన్నాయి.

సమ్మోహనం

ఏ పసితనంలోనో నా మనసుమీద గాఢంగా ముద్రవేసుకున్న రంగుల కలల్లో హాన్స్ క్రిస్టియన్ ఏండర్సన్ కథలు కూడా ఉన్నాయి. అవి ఏండర్సన్ రాసిన కథలు అని తెలియకముందే ఆ కథలు నా హృదయంలో సీతాకోక చిలుకల్లాగా వాలి గూడుకట్టుకున్నాయి