భూమి ఇంకా ఖండాలుగా విడిపోకముందు

ఆ ప్రథమ క్షణాలు, తను ఏకకాలంలో వ్యక్తిగానూ, గణంగానూ, సమస్త పృథ్విగానూ ఉండే క్షణాలు, ఆ క్షణాల్లోని ఎల్లల్లేని ఆ ఐక్యభావన, తాను 'అవిభక్త కుటుంబీ, ఏకరక్త బంధువు 'అని స్ఫురించిన ఆ క్షణాలు, అవే తొలిమానవుడి సైన్సు, దర్శనం, కవిత్వం.

ఎక్కడి పుష్కిన్! ఎక్కడి చినవీరభద్రుడు!

కానీ, ఊహించలేదు, ఒకరోజు ఈ కవిత గురించీ, పుష్కిన్ గురించీ, నా గురించీ, కోకిల గురించీ ఒక మిత్రురాలు నేరుగా రష్యన్ మిత్రులముందే ముచ్చటిస్తారని!

ఇషయ్యా-2

మొత్తం 66 అధ్యాయాల ఇషయ్యా గ్రంథం ఆ విధంగా ఒక ఇతిహాసం, ఒక ఉపనిషత్తు, ఒక సువార్త, దేవుడికీ, మనిషికీ మధ్య నడిచిన దీర్ఘసంభాషణ. ఒక అవిశ్వాసికీ, అవిశ్వాస సోదరసమాజానికీ మధ్య నడిచిన ఎడతెగని సంవాదం.