నిన్న మళ్ళా కృష్ణలీలా తరంగిణి మీద మాట్లాడటానికి కూచున్నప్పుడు గీతగోవింద కావ్యం లో కన్నా కూడా అందులో విస్తృతీ, వైవిధ్యం మరింత ఉన్నాయనిపించింది. ఆ మాటే చెప్పాను అక్కడ. గీతగోవింద కావ్యానికి జీవితకాల ఆరాధకుడిగా నేనా మాటలు చెప్పడం నాకే ఆశ్చర్యమనిపించింది. కానీ ఏం చెయ్యను? కృష్ణలీలాతరంగిణి మహిమను నేనిన్నాళ్ళూ గుర్తించవలసినట్టుగా గుర్తించలేదేమో అనిపించింది.
ప్రపంచ కవి
కవిగా మాత్రమే కాదు, గాయకుడిగా కూడా గద్దర్ ది అద్వితీయమైన గళం. గానం. ఆ గొంతులోని జీర, ఆ అరుపులు, ఆ విరుపులు, మధ్యలో ఆ ఉరుములు, ఆ నొక్కులు- అవి అతడి పాటకు అద్దే ప్రత్యేకత మరొకరి గొంతులో మనం వినగలిగేది కాదు.
ఆషాఢమేఘం-30
రామాయణ వర్షాన్ని భాగవత వర్షంతో పోలిస్తే వెయ్యేళ్ళ కాలంలో భారతీయ దృక్పథంలో ఎటువంటి మార్పు వచ్చిందో మనకి తేటతెల్లంగా తెలుస్తూ ఉంది. తత్పూర్వ కవిత్వాలు ఇంద్రియతాపాన్ని రగిలించేవిగా ఉండగా, భాగవత వర్షం ఇంద్రియతాపాన్ని శంపింపచెయ్యడం మీదనే దృష్టిపెట్టిందని మనకి సులభంగానే బోధపడుతుంది.