21వ శతాబ్దపు కవి

ఒక్క మాటలో చెప్పాలంటే, అతడు తన సర్వేంద్రియాలతోనూ కవితని చూస్తాడు, పలుకుతాడు. దాన్నతడు Wholespeak అన్నాడు. అది మనిషి తన పూర్తి అస్తిత్వ స్పృహతో, తన కలలు, మెలకువలు మొత్తాన్ని కలుపుకుంటూ మాట్లాడే మాట. తద్విరుద్ధమైనదాన్ని, అంటే, మన వ్యవహారానికి మాత్రమే పనికొచ్చేదాన్ని Narrowspeak అన్నాడు. ఈ మెలకువలో అతడు ఆస్ట్రేలియన్ ఆదివాసుల ప్రాపంచిక దృక్పథానికి సంపూర్ణ వారసుడు.

అన్ కామన్ వెల్త్

ఆస్ట్రేలియన్ కవి లెస్ మర్రీ (జ.1938-) మన సమకాలిక ఇంగ్లీషు కవుల్లో అగ్రశ్రేణికి చెందినవాడే కాక, ఇప్పుడు ప్రపంచంలో కవిత్వవిద్యను సాధనచేస్తూన్న అత్యంత ప్రతిభాశీలురైన కవుల్లో ఒకడు కూడా. ఆస్ట్రేలియన్ కవిత్వంలో భాగంగా అతడి కవిత్వం కామన్ వెల్త్ కవిత్వం అని చెప్పొచ్చుగాని, అతడు చూసిన, చూపించిన సౌందర్యం చాలా uncommon wealth.

అజేయులు

నేనెక్కడో చదివాను, గొప్ప గురువులు ఏదీ ప్రత్యేకంగా నేర్పరు, నేర్చుకోవడమెట్లానో మటుకే నేర్పుతారు అని. ఆ మాట మా తాడికొండ పాఠశాలకి అక్షరాలా అన్వయిస్తుంది. ఆ పాఠశాల మా ముందు ఎన్నో జీవితాశయాలు పెట్టింది కాని, అన్నిట్నీ మరిపింపచేసే ఒక జీవితాదర్శాన్ని కూడా మా ముందుంచింది, అదేమంటే