భగ్నదేవతావిగ్రహం

ఎవరో అన్నారు, సంగీతాన్ని అనుకరించి మాత్రమే నేర్చుకోగలమని. బహుశా ఆ మాట కవిత్వకళకి కూడా వర్తిస్తుంది. నా మటుకు నేను కొందరు కవుల్ని నమూనాలుగా పెట్టుకునే కవిత్వసాధన చేస్తూంటాను. అట్లాంటి కవుల్లో జర్మన్ కవిశ్రేష్టుడు రేనర్ మేరియా రిల్కె (1875-1926)ని ముఖ్యంగా చెప్పుకోవాలి.

సీమస్ హీనీ

మొన్న 30 వ తేదీనాడు ప్రపంచప్రసిద్ధ కవి, 1995 సంవత్సరానికిగాను నోబెల్ సన్మానితుడూ సీమస్ హీనీ డబ్లిన్ లో ఈ లోకం నుంచి నిష్క్రమించాడు. యేట్సు తరువాత అంతటి స్థాయినందుకున్న ఐరిష్ కవిగా రాబర్ట్ లోవెల్ అతణ్ణి ప్రస్తుతించినప్పటినుంచీ, హీనీ కేవలం ఐరిష్ కవిగా మాత్రమే కాక తక్కిన ప్రపంచానికి చెందిన కవిగా కూడా మారిపోయాడు.

క్లౌడ్స్

అసెంబ్లీ సమావేశాల కోసం నోట్సు తయారు చేసుకుంటూనే మధ్యలో అరిస్టోఫేన్సు 'క్లౌడ్స్' నాటకం చదవడం పూర్తి చేసేసాను. నాటకం గురించీ, నాటకకర్త గురించీ నా ఆలోచనలు ఫ్రెష్ గా ఉండగానే మీతో పంచుకుందామనిపించింది.