ఏనీడ్ -2

ఎందుకంటే ఏనీడ్ లో కథానాయకుడు తన ప్రయాణంలో భాగంగా నరకలోకానికి కూడా వెళ్తాడు. నరకం ఎలా ఉంటుందో వర్జిల్ కి తెలుసు. నరకం గురించి హోమర్ కి కూడా తెలుసు. ఓడెస్సీలో ఒడెస్యూస్ కూడా నరకంలో అడుగుపెడతాడు. కాని హోమర్ చూసిన నరకం వేరు. వర్జిల్ చూసిన నరకం వేరు.

ఎనీడ్ -1

అతి బలహీనమైన అనువాదంలో చదివినా కూడా కవిగా వాల్మీకి ప్రతిభని మనం పట్టుకోగలిగినట్టే, ఇంగ్లీషు అనువాదం చదివి కూడా మనం వర్జిల్ ని మహాకవి అని అంగీకరించగలం. అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన ప్రయోగించే ఆ ఉపమానాలు. నిన్ను నిలవనియ్యని ఆ కథాకథన చాతురి. నిన్ను ఉక్కిరిబిక్కిరిచేసే ఆ సంఘటనా క్రమం. అన్నిటికన్నా ముఖ్యంగా అల్పవివరాల్ని కూడా తన దృష్టిపథం నుంచి పక్కకు పోనివ్వని ఆ లోకజ్ఞత, ఆ సూక్ష్మపరిశీలనా శక్తి

విశిష్ట ఉపాదానం

అక్కణ్ణుంచి పాశ్చాత్య విమర్శకులు ముందుకు పోలేకపోయారు. ఎందుకంటే, బోదిలేర్ ఆదిమపాపాన్ని నమ్మినంతగా, భగవదనుగ్రహాన్ని నమ్మినట్టుగా కనిపించలేదు వాళ్ళకి. కాని, పాశ్చాత్య విమర్శకులు ఎక్కడ ఆగిపోయారో, రాధాకృష్ణమూర్తిగారు అక్కణ్ణుంచి మొదలుపెట్టారు.