ప్రేమభాషా కవి

యుద్ధమధ్యంలో, 'మండే ఇసుకలో నెత్తురోడుతో డేక్కుంటో ఫస్ట్ ఎయిడ్ స్టేషన్ కి వెళ్ళవలసిన జీవితం మధ్య' వాళ్ళు ప్రేమకోసం, శాంతికోసం తపించారు. సుఖంగా, సౌకర్యంగా జీవిస్తో మనం మన భాషని 'ద్వేష భాష' గా మార్చుకుంటున్నామని తెలియవలసి రావడంలో ఉన్న విషాదం చెప్పలేనిది.

ఒక చక్కెర బిడారు

ఈ అనువాదకులు రూమీలో మరేదన్నా కలిపి ఒక మత్తుమందు తయారు చేస్తున్నారా అని అనుమానమొచ్చి నికల్సన్ నీ, కోలమన్ బార్క్స్ నీ దగ్గరపెట్టుకుని కొన్ని పేజీలకు పేజీలు పోల్చి చూసుకున్నానొకసారి. ఉహుఁ. రూమీ ఒక చక్కెర బిడారు.

దివ్యప్రేమ గీతం-9

ప్రేమ మేలుకోవడమే మనిషికి రెండవ పుట్టుక. తల్లి నిన్ను కంటుంది. నీ జీవితంలో ప్రవేశించిన ప్రేమికుడో, ప్రేమికురాలో నీలో ప్రేమని మేల్కొల్పడం ద్వారా నిన్ను తిరిగి కంటారు.

Exit mobile version
%%footer%%