ఇషయ్యా-1

ఇషయ్యా గ్రంథంలో సొలోమోను ప్రేమగీతంలోని సుకోమలత్వంతో పాటు, సామగీతాల్లోని దాహార్తి, విలాపాల్లోని ఆక్రోశమూ మాత్రమే కాక, కొండమీది ప్రసంగంలోని మహిమాన్విత భగవత్సందేశం కూడా ఉన్నాయి.

కన్ ఫ్యూసియస్

ఒక్క మాట మాత్రం చెప్తాను. సమాజం పట్ల అపారమైన బాధ్యత, మనుషులు సంతోషంగానూ, శాంతిగానూ జీవించాలన్న తపన ఉన్న మనిషి మాత్రమే అటువంటి జీవితం జీవించగలుగుతాడు, అటువంటి మాటలు మాట్లాడగలుగుతాడు.

ఆవిరిపూల కొమ్మ

అందులో ఉన్నది కేవలం టీ కాదు. అది నాగరికత పేరుమీద చలామణి అవుతున్న అనాగరిక పాశ్చాత్య జీవనదృక్పథం పట్ల ఒక మందలింపు. ప్రాచ్య సంస్కృతులు, చీనా, జపాన్, భారతదేశాల్లో మనిషి యుగాల తరబడి ఏ ఆధ్యాత్మిక సత్యాల్ని తన జీవనశైలిగా మార్చుకున్నాడో దాన్ని తెలియపరిచే ఒక మెలకువ.