యుగయుగాల చీనా కవిత-22

తన ముందు కాలాలకు చెందిన పరివ్రాజక కవుల్ని నమూనాగా పెట్టుకుని అతడు కవిత్వం చెప్పాడు. తావో చిన్ లాగా ప్రభుత్వోద్యోగాన్ని వదిలిపెట్టి, పల్లెకి పోయి రైతులాగా బతకాలనుకున్నాడుగాని, జీ లింగ్ యూన్ లాగా మూడు సార్లు ఉద్యోగ పరిత్యాగం చేసి, మళ్ళా మూడు సార్లు ఉద్యోగంలో చేరకుండా ఉండలేకపోయాడు.

యుగయుగాల చీనా కవిత-21

ప్రవాస దుఃఖాన్ని వ్యక్తీకరించడంలో చీనా సాహిత్యంలో అటువంటి కవిత మరొకటి లేదు. అందులో బెంగ, అపరాధ భావం, అవమానం, వినష్టహృదయం మాత్రమే లేవు. నిజానికి అది ఒక ప్రదేశానికి దూరమైన దుఃఖం కాదు. తిరిగి రాని, ఎన్నటికీ తాను తిరిగి చూడలేని ఒక వైభవోజ్జ్వల శకం గురించిన దుఃఖం.

యుగయుగాల చీనా కవిత-20

ప్రాచీన చీనా కవుల్ని మన కవిత్రయంతోనూ, యోంగ్ మింగ్ కవుల్ని ప్రబంధ కవులతోనూ పోల్చి చూసుకుంటే, వారు సాహిత్యంలో పెద్ద పీట వేసిన ఇంద్రియనైశిత్యం గర్హనీయం కాకపోగా, స్వాగతించదగ్గదే అనిపిస్తుంది.