అత్యున్నత రూపకాలంకారం

మనం ఎవరితో కలిసి జీవించక తప్పదో, అలా జీవించవలసి వచ్చినందువల్ల ఎవరిని మనం సదా ద్వేషిస్తూ ఉంటామో అతడు మన పొరుగువాడు. నన్ను నేను ప్రేమించుకున్నట్టు నేనతణ్ణి ప్రేమించడం సాధన చెయ్యమంటున్నాడు యేసు.

స్మృతిగా, స్వప్నంగా, ఊహగా

ఇప్పుడామె కవిత్వం మనం చదువుతూన్నప్పుడు మనం కూడా మన మౌలిక కౌటుంబిక అనుబంధాల్ని వంచనా రహితంగా పరికించుకోకుండా ఉండలేం. అందుకనే ఆమె మనకి అత్యంత ఆత్మీయురాలిగా గోచరిస్తూ ఉన్నది.

ఎమిలీ డికిన్ సన్ వారసురాలు

పొందడం, పోగొట్టుకోవడం, సంతోషం, సంతోషరాహిత్యం, సాన్నిహిత్యం, ఒంటరితనం లాంటి అత్యంత మౌలిక మానవానుభవాల్ని ఆమె తన మనసనే మైక్రోస్కోపులో పెట్టి పరీక్షిస్తూనే వచ్చింది. ఆమె కవిత్వం నుంచి మనకి లభించగల అతి గొప్ప ఉపాదానమిదే: ఆ కవితలు చదువుతున్నప్పుడు, మన తల్లులూ, మన తండ్రులూ మనకి కొత్తగా పరిచయమవుతారు.