డెరెక్ వాల్కాట్

కవి, నాటక కర్త, చిత్రకారుడు, డెరెక్ వాల్కాట్ (1930-2017) మొన్న మరణించాడు. కరీబియన్ సాహిత్యానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుని తీసుకువచ్చిన సమకాలిక కవి. సుమారు నాలుగుకోట్ల జనాభా ఉన్న 25 కరీబియన్ దీవులనుంచి సాహిత్యంలో నోబేల్ పురస్కారం పొందినవాళ్ళల్లో సెంట్ జాన్ పెర్స్ వి.ఎస్.నయిపాల్ తర్వాత వాల్కాట్ మూడవవాడు.

మీకు కొన్ని సంగతులు చెప్పాలి

'ద పొయెట్రీ ఆఫ్ అవర్ వరల్డ్ ' (పెరిన్నియల్, 2000) చాలా విలువైన పుస్తకం. ' ద వింటేజి బుక్ ఆఫ్ కాంటెంపరరీ వరల్డ్ పొయెట్రీ ' (1996), 'వరర్ల్డ్ పొయెట్రీ' (నార్టన్,1997) లతో పాటు ప్రతీ రోజూ నాకు నా స్పూర్తినివ్వడానికి నా బల్లమీద పెట్టుకునే పుస్తకంగా మారిపోయింది.