ఎర్రాప్రగడ

ఇప్పుడు ఏ మిగలముగ్గిన తాటిపండుని చూసినా ఎర్రాప్రగడ గుర్తుకు వస్తాడు. ఎర్రన రాసిన ఏ పద్యం చదివినా చెట్టుమీదే పండి చుట్టూ గాలిని సురభీకరించే తాటిపళ్ళు గుర్తొస్తాయి.

చిన్న చీమ హెచ్చరిక

తిన్నప్పుడు, తాగినప్పుడు, అప్పుడు మాత్రమే అతడు మనిషిననుకుంటాడు, మరి మనిషిలాగా పనిచేస్తున్నప్పుడో తనను తానొక పశువుననుకుంటాడు, ఎద్దనుకుంటాడు, గాడిదనుకుంటాడు.

నేపథ్యం

అబ్బులుబాబు జుట్టు పీక్కున్నాడు. తుఫానులో నౌకలు చిక్కుకున్నప్పుడు ముసలి సరంగులు జుట్టుపీక్కున్నట్టు. ‘ఆడలేం, ఆడలేం అంటున్నాను.’