జర్మన్ తత్త్వవేత్త కాంట్ రచనలు

ఆధునిక పాశ్చాత్యతత్త్వశాస్త్రంలో అత్యున్నత స్థాయి తాత్త్వికుడిగా పరిగణించబడుతున్న ఇమాన్యువల్ కాంట్ (1724-1804) రచనలనుండి ఎంపికచేసిన ప్రధానమైన భాగాలకు వాడ్రేవు చినవీరభద్రుడు చేసిన అనువాదం.

సత్యాన్వేషణ

2500 ఏళ్ళ పాశ్చాత్య తత్త్వశాస్త్రంలో సత్యమీమాంస శాఖనుంచి ఎంపిక చేసిన 72 మంది తాత్త్వికుల రచనలనుండి చేసిన అనువాదాలతో పాటు, పాశ్చాత్యతత్త్వశాస్త్ర చరిత్ర స్థూలపరిచయం కూడా పొందుపరుచుకున్న గ్రంథం 'సత్యాన్వేషణ' (2003).

వందేళ్ళ తెలుగుకథ

దాదాపు ఒక శతాబ్దకాలంపాటు తెలుగుకథలో సంభవించిన స్థూల, సూక్ష్మ పరిణామాల్ని దశాబ్దాల వారిగా వివరిస్తూ, text నీ, context నీ జమిలిగా అల్లిన అద్వితీయ ప్రయత్నం.