యు ఆర్ యునీక్

అన్నిటికన్నా నన్ను ఎక్కువ ఆశ్చర్యపరిచిన విషయం, డా.కలాం తన జీవితంలో చివరి సంవత్సరాలకు వచ్చేటప్పటికి సామాజిక అన్యాయానికి వ్యతిరేకంగా గళమెత్తడం. ఆయన కేవలం ఉత్పత్తి గురించి మాత్రమే మాట్లాడేడు, పంపిణీ గురించి పట్టించుకోలేదు అనేవారికి ఈ పుస్తకం ఒక సమాధానం.

ఎల్లలోకము ఒక్క ఇల్లై

తెలుగు కాక, తక్కిన ప్రపంచ భాషా సాహిత్యాల్లో నేను చదివిన కవిత్వం మీద రాసిన వ్యాసాల్ని ఇప్పుడు ఈ రూపంలో మీకు అందిస్తున్నాను. ఆరు ఖండాలు, ముప్పైకి పైగా భాషలు, 182 వ్యాసాలు, 912 పేజీలు.